జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో బాలల దినోత్సవం మరియు ఒలింపియాడ్, అకాడమిక్ ఎక్సలెన్స్ మెడల్స్ ప్రదానోత్సవం క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఒలింపియాడ్ అకడమిక్ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బాలల దినోత్సవం పిల్లల సృజనాత్మకత, ఆనందం, మరియు అభ్యసన పట్ల ఆసక్తిని వేడుకగా జరుపుకునే రోజు అని తెలిపారు. విద్యార్థుల విజయాలు పాఠశాల గర్వకారణమని పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు.
ఈరోజు చిల్డ్రన్స్ డే కాకుండా 2024- 25 అకాడమిక్ ఎక్సలెన్స్, ఒలంపియాడ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులలో ఆనందం, ఉల్లాసం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లల సృజనాత్మకత ఆనందం అభివృద్ధిని గుర్తుచేసే ప్రత్యేకమైన రోజు.. మా శ్రీ భాషిత విద్యార్థులు ఒలంపియాడ్ లో సాధించిన విజయాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయి. అంతేకాకుండా ప్రతి విద్యార్థి తమలక్ష్యాలను చేరుకోవడానికి మేము నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
