జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో తైక్వాండో కరాటే బెల్ట్ టెస్టులను తైక్వాండో గ్రాండ్ మాస్టర్ భోజన్న ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, తైక్వాండో జిల్లా అధ్యక్షులు ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కరాటే మాస్టర్ భోజన్న, ఈరవత్రి రాజశేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు బెల్ట్ ,సర్టిఫికెట్లు అందజేశారు. ఈ పోటీలో వివిధ పాఠశాలలకు చెందిన 108 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఎంపికలో బ్లూ బెల్ట్ విజేతగా అరుష్, అలాగే గ్రీన్ వన్ బెల్ట్ సాధించిన లలిత్, శ్రీ వర్ధన్, తేజ, సన్నీ, దుర్గ భవాని, లాస్య, అమూల్య, ఎం రక్షిత ,విద్య, సిద్ధార్థ, అనిత , శ్రీజ బెల్ట్ సర్టిఫికెట్లను అందుకున్నారు. మిగతా 100 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్ సాధించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కరటే ను నేర్చుకోవడం సాహసోపేతం అన్నారు. కరటె ఆత్మవిశ్వాసాన్ని, దేహదారుఢ్యాన్ని పెంచుతుందన్నారు. బెల్ట్ సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కరాటే ఆత్మ రక్షణ కొరకై ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే కరాటే కోచ్ భోజన్న, రాజు లను రాజశేఖర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రామచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు.
