- జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి నూతన ఎస్సై మహేష్ ను తొర్లికొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎస్ఐ పదవి బాధ్యతలు చేపట్టినందుకుగాను శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ కనక రవి, జక్రాన్ పల్లి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వంశీ, మండల నాయకులు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కనక రాకేష్, బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షుడు సాగర్, తదితరులు పాల్గొన్నారు.
