జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో పట్టణ గౌడ యువసేన అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ యువసేన కోశాధికారిగా ఎలుక జీవన్ గౌడ్ ను నియమించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గౌడ యువసేన అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ యువసేన ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్ లు పట్టణ గౌడ యువసేన కోశాధికారి ఎలుక జీవన్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల గౌడ యువసేన అధ్యక్షులు ఉదయ గౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
