జయ్ న్యూస్, ఆర్మూర్:
*ER ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ నిషేధం తదితర అంశాలపై అవగాహన*
*విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్*
*మొదటి, రెండవ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు*
*ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ER ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని డ్రగ్స్ నిషేధంపై, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ముందుగా వారు విద్యార్థులతో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందిస్తున్నారని, మీరు కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యపై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మైనర్లు ఎవరు వాహనాలు నడపవద్దని సూచించారు. మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల శ్రమను వృధా కానివ్వ వద్దని, మంచి మార్గంలో విద్యార్థులు ఉంటూ శ్రద్ధగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.



సమాజంపై, చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మనమందరం ఇతరులకు ఆదర్శంగా నిలుద్దామని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరంలో గల అన్ని గ్రూపుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ రవి, ER ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, నూకల శేఖర్, గంగామోహన్, టైలర్ వినోద్, కళాశాల అధ్యాపకులు సుభాష్ చంద్రశేఖర్, చంద్ర మోహన్, స్టూడెంట్ కౌన్సిలర్ సుమన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.*
