జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం పల్లె (చేపూర్) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం ఆర్మూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నరెడ్డి సమక్షంలో నిర్వహించారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంసన్, చేపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, బీసీ సెల్ మండల్ అధ్యక్షులు శ్రీనివాస్, జోరిగే ధర్మయ్య, ఎలుక రంజిత్, రాకేష్, అశోక్, సుధాకర్, సాయి గౌడ్, బీరయ్య, భూమేష్ తదితర నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
