జయ్ న్యూస్, ఆర్మూర్: బుధవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 25వ వార్డులో వీధి నంబర్ 07లో బీటీ రోడ్డు పనులను బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ ఒక్క రోడ్డు వెంకటేశ్వర కాలనీ అనుకుని నేరుగా రాజారాం నగర్ గోవింద్ డాక్టర్ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుందని ఈ రోడ్డు పనులను అక్కడున్న కాంట్రాక్టర్ తో మరియు కమిషనర్ తో మాట్లాడి నాణ్యతను దృష్టిలో పెట్టుకొని పనులను సక్రమంగా చేయవలసిందిగా అక్కడున్న స్థానికులతో కలిసి మాట్లాడటం జరిగిందని వారు తెలిపారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న నిధులను తిరిగి తెప్పించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఆర్మూర్ లో ఉన్న పుర ప్రముఖులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, పట్టణ జనరల్ సెక్రెటరీ ఖాందేష్ ప్రశాంత్, యువమోర్చా పట్టణ అధ్యక్షులు ఉదయ్ గౌడ్, మాజీ పట్టణ జనరల్ సెక్రెటరీ పులి యుగేందర్, మనీ, 24వ వార్డు కాలనీవాసులు పాల్గొన్నారు.
