జయ్ న్యూస్, ఆర్మూర్: బుధవారం జాతీయ బార్ కౌన్సిల్ మెంబర్, అసిస్టెంట్ సోలిసిటర్ విష్ణు వర్ధన్ రెడ్డి ఆర్మూర్ బార్ అసోసియేషన్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, కృష్ణ పండిత్, మద్దెపల్లి మోహన్, ఎంకే నరేందర్, తెడ్డు నర్సయ్య, ఏలేటి గంగాధర్, చిన్న రెడ్డి, కృష్ణంరాజు మరియు తదితర న్యాయవాదులు ఆయనకు ఘనంగా ఆహ్వానం పలుకుతూ శాలువాతో బార్ హాలునందు ఘనంగా సన్మానించడమైనది. వారు బార్ అసోసియేషన్ సభ్యుల సమస్యను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
