
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో శ్రీవారి జయంతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ నృసింహ జయంతి మహోత్సవం సందర్భంగా లింబాద్రిగుట్ట పై శనివారం శ్రీ నృసింహ సుదర్శన హోమం నిర్వహించారు.
స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే భీంగల్ పట్టణంలోని గ్రామాలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
చుట్టుపక్కల ప్రాంతాల నుండి
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.