జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా 19వ వార్డు ఇంచార్జ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ హాజరయ్యారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం చేశారు. వార్డు ఇంచార్జ్ విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
